ఈ ఏడాది మార్చి లో సంభవించనున్న సంపూర్ణ చంద్రగ్రహణం (Blood Moon) ఒక కీలక ఖగోళ సంఘటన. ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం.. విశ్వావశునామ సంవత్సరంలో చివరి గ్రహణం మార్చి 3 ఏర్పడుతుందని ఖగోళశాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ గ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుంది.. భారతదేశంలో కనపడుతుందా.. ఎలాంటి నియమాలు పాటించాలి.. మొదలగు విషయాలను తెలుసుకుందాం. .!
ఈ ఏడాది ( 2026) మార్చి 3 వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం సింహరాశిలో కేతుగ్రస్తోదయ చంద్రగ్రహణం ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు అంటున్నారు. ఇది భారతదేశంలో చాలా పాక్షికంగా కపడుతుంది. అందువలన సూతకాలం.. ఆలయాలు మూసివేయడం.. పట్టు స్నానం.. విడుపు స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు.
గ్రహణ సమయం మరియు తేది
- చంద్రగ్రహణం తేది: 2026 మార్చి 3
- గ్రహణం ప్రారంభ సమయం: మధ్యాహ్నం 3.20 గంటలకు
- గ్రహణం ముగింపు సమయం : సాయంత్రం 6.47 గంటలకు
- భారతదేశంలో కనిపించే సమయం: సాయంత్రం 6.20 గంటల నుంచి 27 నిమిషాలు
- గ్రహణం పూర్తి సమయం : 3 గంటల 27 నిమిషాలు
- మోక్షకాలం : 6.48 గంటలకు
మార్చి 3న ఆకాశంలో చంద్రగ్రహణం ఆకాశంలో బ్లడ్ మూన్ అద్భుత దృశ్యమని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. భూమి నీడ చంద్రునిపై పడటం వల్ల, చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. ఈశాన్య భారత రాష్ట్రాలు అంటే బెంగాల్, నాగాలాండ్, మిజోరం, అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ లో చంద్రగ్రహణం బాగా కనిపిస్తుంది. మిగిలిన ప్రాంతాల్లో చంద్రగ్రహణం ముగింపు మాత్రమే కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన దేశంతో పాటు ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్ లో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుందని అంటున్నారు.
ఎలా చూడాలి..
- ఈ గ్రహణాన్ని చూసేందుకు ఎలాంటి ప్రత్యేక పరికరాలు అవసరంలేదు.
- బైనాక్యులర్లు.. టెలిస్కోప్ వంటి పరికరాలతో వీక్షిస్తే స్పష్టంగా కనపడుతుంది
- చీకటి ప్రదేశాన్ని ఎంచుకోండి
